E-PAPER

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఏమైంది? – బిజెపి నేత రవి పటేల్ ప్రశ్న

బూర్గంపాడు, జూన్ 26 వై 7 న్యూస్;

ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామని చెప్పిన మాటలను మర్చిపోయిందని బిజెపి నాయకుడు కోడె బోయిన రవి పటేల్ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “రైతు భరోసా కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడమే కాకుండా, అది కేవలం తూతూ మంత్రంగా మారిందని ప్రజలు భావిస్తున్నారు” అన్నారు. “ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైంది? రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటలు గాలిలో కలిసిపోయాయని ప్రజలు ఆశాభంగానికి లోనవుతున్నారు” అని విమర్శించారు.

అలాగే, రైతు భరోసా పేరిట ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేస్తున్నట్టు చెప్పి, ఆ డబ్బులు నిజంగా రైతుల చేతికి రాకుండా అప్పుల కింద జమ అవుతున్నాయని ఆరోపించారు. “ఇది రైతులను మరింత భారంలోకి నెట్టడం వలే” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల పేరిట నిరుపేదలకు నివాసాలు ఇస్తామని చెప్పిన హామీ కూడా పూర్తిగా విఫలమైందని చెప్పారు. “ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. మాటలతో కాలం గడపడం మానుకోవాలి. హామీల అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టత చూపాలి” అని డిమాండ్ చేశారు.రవి పటేల్ ఆవేదనను ప్రజల నాడి అర్థం చేసుకునే నాయకుడిగా వెల్లడించడమే కాకుండా, భవిష్యత్తులో ప్రజలకు వాస్తవాలపై ఆధారపడిన పాలన అవసరమని సూచించారు.

✍️ పులిపాటి పాపారావు | జర్నలిస్ట్

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News