అశ్వాపురం, జూన్ 26 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో ఉన్న పవిత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంను భద్రాద్రి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు దర్శించుకున్నారు.ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తన నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రేగా కాంతారావును శాలువాతో ఘనంగా సత్కరించారు.పూజ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో నిండిపోయింది.
Post Views: 305









