కర్నూలు జూన్ 26; వై 7 న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడుగా మునీంద్రా బాబు మంగలిని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ నియమించారు. ఈ మేరకు గురువారం మునీంద్రాకు ఆన్లైన్లో నియామక ఉత్తర్వులు అందజేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జై స్వరాజ్ పార్టీ శరవేగంగా విస్తరిస్తోందని, కొత్త తరానికి సరికొత్త రాజకీయాన్ని అందించే లక్ష్యంతో ముందుకు వచ్చిన తమ పార్టీని ఆబాల గోపాలం ఆదరిస్తోందని కేఎస్ఆర్ గౌడ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉత్తమమైన సిద్ధాంతం, కొత్త తరానికి రాజకీయ అవకాశాలు కలిస్తూ సోషలిస్టు వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా అణగారిన వర్గాలను కలుపుకుని ముందుకు పోతున్న జై స్వరాజ్ పార్టీలో పని చేయడం తనకెంతో ఆనందంగా ఉందని మునీంద్రా బాబు ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలు జిల్లాలో పార్టీని నిర్మిస్తూ రానున్న వివిధ ఎన్నికల్లో పోటీ చేసేలా పార్టీని సిద్ధం చేస్తామని, అలాగే తనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ, జాతీయ కమిటీ, ఆంధ్రప్రదేశ్ శాఖ జై స్వరాజ్ పార్టీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.