E-PAPER

షాద్ నగర్ కుంగ్ ఫు మాస్టర్ అహ్మద్ ఖాన్ కు దక్కిన అరుదైన గౌరవం

వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ అవార్డు సొంతం

రంగారెడ్డి జిల్లాజూన్ 25 వై 7 న్యూస్

షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్, మాస్టర్ అహ్మద్ ఖాన్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టత్మకైనా వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యర్యంలో హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ కమ్యూనిటీ హల్ ఈసీఐఎల్ పార్క్ లో నిర్వహించిన వరల్డ్ చారిటీ అవార్డ్స్ సర్మనీ లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ కు కుంగ్ ఫు, మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ప్రదర్శించిన సందర్బంగా బెస్ట్ కోచ్ అవార్డు దక్కింది.చిన్నప్పటి నుండి కరాటే, కుంగ్ ఫు పై ఆసక్తి తో కేశంపేట మండలం నుండి షాద్ నగర్ కు వచ్చి మాస్టర్ బాలరాజ్ వద్ద కుంగ్ ఫు లో మెలుకువలు నేర్చుకొని పైకేదుకుతూ ఇప్పుడు షాద్ నగర్ లో న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ పెట్టి ఎంతోమంది చిన్నారులు, మహిళలకు కుంగ్ ఫు లో శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లో ఎన్నో అవార్డులు, మెడల్స్ సాధించి షాద్ నగర్ కు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన మాస్టర్ అహ్మద్ ఖాన్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. కుంగ్ ఫు విద్యార్థులకు క్రమశిక్షణ తో పాటు కర్రసాము, నాన్చాక్, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలో నేర్పుతు వారి జ్ఞాపకశక్తి ని పెంపోందిస్తూ ముందుకు సాగుతున్న తీరు అమోఘం. ఈ సందర్బంగా అతని పనితిరును గుర్తించి ప్రతిష్టత్మకమైన వరల్డ్ చారిటీ అవార్డు ను అతనికి అందజేశారు. ఈ సందర్బంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ తనను వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ వారు గుర్తించి అవార్డు అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్బంగా వరల్డ్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకముందు కూడ చిన్నారి విద్యార్థుల కు, మహిళలకు కుంగ్ ఫు లో తర్పిదు ఇస్తూ ముందుకు సాగుతూ షాద్ నగర్ పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో నిలబెట్టడానికి సాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News