భారీ బ్లాస్టింగ్లతో ఇండ్లకు పగుళ్లు వస్తూ కూలిపోతున్నాయంటూ గుండ్లపల్లి గ్రామ ప్రజలు ఆందోళన.
డెప్తుకు మించి బ్లాస్టింగ్ పెడుతున్నారంటూ ఆందోళన.
సూర్యాపేట, జూన్ 25 వై 7 న్యూస్;
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి కూత వేటు దూరంలో పాత గుండ్లపల్లి కాలనీ ఉంది. నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ కి సంబంధించిన మైనింగ్ వలన గ్రామంలోని ఇండ్లపై ఉన్న రేకులకు సిమెంటు ఇటుకలకు పగుళ్లు బేస్ మట్టాలలు క్రాక్ కులకు గురవుతున్నాయంటూ గుండ్లపల్లి గ్రామ ప్రజలు నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్ లో ధర్నాకు దిగారు. గతంలో కూడా ధర్నాకు దిగితే స్టేషన్కు పిలిపించి మాట్లాడారు తప్ప ఎన్ సి ఆల్ యజమాని నుంచి ఎటువంటి స్పందన లేదు.ఇక్కడ మైనింగ్ లో జరుగుతున్న బ్లాస్టింగ్ వల్ల పెద్ద పెద్దలు శబ్దాలు వచ్చి గుండె వ్యాధులకు సంబంధించిన రోగులు భయాందోళనకు గురవుతున్నారు. మైనింగ్ నుంచి వచ్చే బూడిద వల్ల గ్రామంలోని ప్రజలు చర్మవ్యాధులు మరియు ఇతర వ్యాధులతో ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ ప్రజలు అనేక రకాలుగా వ్యాధుల బారిన పడుతుంటే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం వారి తీరును మార్చుకోవడం లేదు. ఎన్సిఎల్ యాజమాన్యానికి ఎన్నిసార్లు తమ బాధను మొరపెట్టుకున్నా ఫ్యాక్టరీ వారు మాత్రం మీ గ్రామానికి వచ్చి మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పటం జరుగుతుంది. తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదంటూ గ్రామ ప్రజలు విసిగిపోయారు.మా ఇల్లులు ఆగమైతున్నాయి అని ఎన్ని సార్లు చెప్పిన కూడా సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేదు ఇంత జరుగుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ ప్రజలు తమ ఆస్తులను ఆరోగ్యాలను అనేక రకాలుగా నష్టపోతున్నామని తీవ్ర ఇబ్బంది పడుతున్న కూడా సిమెంట్ యాజమాన్యం నుంచి పిలుపు శూన్యంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.









