E-PAPER

భద్రాచలంలో యువకుల మధ్య ఘర్షణ ;ట్రాలీ కింద పడి పద్దెనిమిది ఏళ్ల యువకుడు మృతి

భద్రాచలం,జూన్ 25 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉద్రిక్తతకు దారితీసిన యువకుల మధ్య వివాదం, ఒక యువకుడి ప్రాణాలు తీసింది. భద్రాచలం శిల్పనగర్ కాలనీలో మంగళవారం ఈ దారుణ ఘటన జరిగింది.
థమ్సప్ ట్రాలీ వాహనంలో ప్రయాణిస్తున్న యువకుడికి, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మరో యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాదన అనంతరం, ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు ట్రాలీ వాహనం పైన దూసుకెళ్లడంతో యువకుడు అదుపుతప్పి కింద పడిపోయాడు. అప్పటికే వేగంగా సాగుతున్న ట్రాలీ వాహనం అతనిని ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు భద్రాచలంలోని ముదిరాజ్ బజార్‌కు చెందిన మనోజ్ గా గుర్తించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని స్థానికులు
పేర్కొంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ విషాద సంఘటనతో శిల్పనగర్ ప్రాంతంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. యువకుల మధ్య చిన్నతనపు వివాదాలు ఇంతటి భయానక ముగింపుకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :