E-PAPER

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు శస్త్ర చికిత్స చేయించిన కాంగ్రెస్ నాయకులు

మానవత్వానికి మరో ఉదాహరణ గురజాల గోపి

మణుగూరు, జూన్ 25 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు పరిధిలోగల వైయస్సార్ నగర్ గ్రామానికి చెందిన ఎం. రాములమ్మ (వయస్సు 40) కొంతకాలంగా గర్భసంచి వద్ద గడ్డలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఆమెకు చికిత్స చేయించుకునే స్తోమత లేక, ఈ బాధను నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చారు.

ఈ విషయం కాంగ్రెస్ మహిళా సీనియర్ నాయకురాలు యం డి. షబానా కి దృష్టికి రావడంతో, ఆమె మణుగూరు కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి క్యాంప్ కార్యాలయానికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గురజాల గోపి,మానవతా దృక్పథంతో ఆ మహిళకు అండగా నిలిచారు.
వారు కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ శంకర్ నాయక్ ని సంప్రదించి, బాధితురాలి గర్భసంచి శస్త్రచికిత్సను విజయవంతంగా చేయించారు. ప్రస్తుతం రాములమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాములమ్మ కుటుంబ సభ్యులు గురజాల గోపి కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. “ఆయన సహాయం లేకపోయుంటే మా కుటుంబం ఏ పరిస్థితిని ఎదుర్కొనేదో ఊహించలేం,” అని వారు కంటతడి పెట్టారు.ఈ ఉదంతం మరోసారి మానవత్వానికి, నాయకుల్లో బాధ్యతాయుతమైన ధృక్పథానికి ప్రతిరూపంగా నిలిచింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News