చలో హైదరాబాద్” కు బంజారాల సన్నద్ధత
మణుగూరు,జూన్ 25 వై 7 న్యూస్;
తెలంగాణ రాష్ట్రంలో బంజారా సమాజంపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు సేవాలాల్ సేన రూపొందించిన “చలో హైదరాబాద్” కార్యక్రమానికి మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో కరపత్రాల విడుదల కార్యక్రమం చేపట్టారు.
ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ, ఈ కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమం సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్ గారి నాయకత్వంలో, రాష్ట్ర కో-కన్వీనర్ బాణావత్ హుస్సేన్ నాయక్ పరివేక్షణలో జరగనుంది.
ఈ సందర్భంగా, బంజారా సమాజంపై జరుగుతున్న వివక్షను ప్రశ్నించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని, సమాజం మరో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.సమాజ హక్కుల కోసం బంజారాలు ప్రళయంగా పోరాడతామని నేతలు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర నిర్మల, మణుగూరు మండల అధ్యక్షుడు గుగులోత్ రమేష్, మండల మహిళా అధ్యక్షురాలు ఇస్లావత్ ద్వాలి, మండల అధ్యక్షులు గుగులోత్ రవికుమార్ నాయక్, మండల ఉపాధ్యక్షురాలు గూగులోత్ కవిత, ఇతర నాయకులు ఇస్లావత్ కోటియా, బానోత్ శాంతి, భూక్య నాగేశ్వరరావు, భూక్య రాము, భూక్య రోజా, భూక్య రమ్య తదితరులు పాల్గొన్నారు.









