E-PAPER

ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం మానుకోవాలి

కాంగ్రెస్ యువ నాయకుడు చింతిరాల అరుణ్ రాజ్

రైతు భరోసా నిధుల పంపిణీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన

భద్రాచలం, జూన్ 25 వై 7 న్యూస్;
ఇచ్చిన మాటకు కట్టుబడి కేవలం తొమ్మిది రోజుల్లో రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి భద్రాచలం నియోజకవర్గం రైతుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చింతిరాల అరుణ్ రాజ్. ఈ సందర్భంగా ఆయన మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా చింతిరాల అరుణ్ రాజ్ మాట్లాడుతూ “ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుల రాజ్యం. మా ప్రభుత్వం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. రైతు భరోసా ద్వారా అందుతున్న నిధులను రైతులు తమ పంటల పెట్టుబడుల కోసం వినియోగించుకోవాలని ఆకాంక్షిస్తున్నాం” అని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకుపైగా రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు. అయినా వీటన్నింటినీ కళ్లకు కనిపించనట్టుగా వదిలేసి, విమర్శలకే పరిమితమవుతున్న ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు.

“ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు మేలుకోాలి. మా ప్రభుత్వం రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధితో పనిచేస్తోంది. విమర్శలు కాదు, చిత్తశుద్ధి అవసరం. రైతులకు నిజమైన మేలు చేసే విధానాలు ప్రతిపక్షాలు సూచించాలని కోరుతున్నాం” అని హితవు పలికారు.

రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం సమిష్టిగా పనిచేస్తోందని తెలిపారు. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా కేవలం 9 రోజుల్లో రైతులకు నిధుల పంపిణీ పూర్తి చేసిన ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రశంసలందుకోవలసిన పనిని చేసిందని అభిప్రాయపడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!