మెదక్ జూన్ 24 వై 7 న్యూస్
మెదక్ విద్యుత్ శాఖ టీఎస్ ఈ ఈయూనియన్ ఆధ్వర్యంలో మెదక్ డివిజన్ యూనియన్ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ ఎస్పీడీసీఎల్ స్టేట్ సెక్రెటరీ భూపాల్ ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల లో ఎస్ బుచ్చయ్య అధ్యక్షులుగా విజయం సాధించగా సెక్రటరీగా రాజు యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రెజరర్ ఎం రాజును ఏకగ్రీవంగా ఎన్నుకొన గా సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సూర్యనారాయణ నియమించారు. ఎన్నికైన వారికి ఎస్పీడీసీఎల్ స్టేట్ సెక్రటరీ భూపాల్ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికైన బుచ్చయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజెన్ల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి గానీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఎస్పీడీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ భూపాల్ మాట్లాడుతూ మన సంస్థకు ప్రభుత్వం అండగా ఉందని కాంట్రాక్టు కార్మికుల నుండి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి యూనియన్ అండగా ఉంటుందని వారి సమస్యలు పరిష్కరించడానికి మంత్రివర్గ కి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని విద్య శాఖలో సేవలు నిష్పక్షపాతంగా అందిస్తున్నామని అందుకు ప్రతి ఒక్కరం గర్వపడాలని అన్నారు. ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేసి సంస్థను కాపాడుకొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో యాదగిరి గౌడ్ విద్యుత్ శాఖ సిబ్బంది అధికారులు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









