E-PAPER

పినపాక రాజకీయాలపై రేణుక చౌదరితో గురజాల గోపి కీలక భేటీ

హైదరాబాద్, జూన్ 17 వై 7 న్యూస్;

పినపాక నియోజకవర్గ రాజకీయాలపై చర్చించేందుకు గురజాల గోపి మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పినపాక నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా రేణుక చౌదరి , పినపాక నియోజకవర్గంలో త్వరలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఆమె పర్యటన స్థానిక రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అదే విధంగా, గురజాల గోపి మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను కూడా పినపాక నియోజకవర్గంలో పర్యటించమని ఆహ్వానించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News