E-PAPER

నీకెంత…? నాకెంత..? సమాచారం ఇచ్చిన నో రెస్పాండ్

మమ్మల్ని ఆపేది లేదంటూ రెచ్చిపోతున్న మట్టి డాన్

సామాన్యుడికి మాత్రం నో పర్మిషన్
దళారులకు ఐతే ఫుల్ పర్మిషన్

పాత్రికేయులపై దురుసు ప్రవర్తన

ఏమి చేయలేవు అంటూ ఛాలెంజ్ లు

అశ్వరావుపేట జూన్ 17

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారవారిగూడెం గ్రామంలో మట్టి మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతుంది, మమ్మల్ని ఏమి చేయలేరంటూ చాలెంజ్ లు విసురుతుంది, మట్టి దళారులకు సైతం రెవిన్యూ శాఖ, పోలీసు శాఖ పూర్తి మద్దతు తెలుపుతున్న తరుణం స్పష్టంగా అర్థమవుతున్న వైనం నారవారిగూడెంలో వెలుగులోకి వస్తుంది,
ఏమి జరుగుతుంది అన్ని ప్రశ్నించిన పాత్రికేయుల పైన విరుచుకుపడుతున్న తరుణం చర్చనీయాంశంగా మారింది,
రెవిన్యూ అధికారులు సైతం ముడుపులు అందాయే అన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి, సమాచారం ఇచ్చిన స్పందించకపోవడంతో వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నామని నిర్లక్ష్యపు సమాధానాన్ని ఇస్తున్న రెవెన్యూ శాఖ అధికారులు తీరు స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది, కనీస బాధ్యతతో స్పందించని పోలీసు శాఖకు సైతం ఎంతెంత ముడుపులు పుట్టాయో అన్న చర్చలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి,
ఏమి జరిగినా అధికారులు స్పందించరు అన్న లక్ష్యంతో మట్టి మాఫియా దళారులు ఇదే చనువుగా తీసుకొని ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్పును సుమారు వెయ్యి రూపాయలు చొప్పున అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్న తరుణం అశ్వరావుపేట మండలంలో సామాన్య పరిస్థితి అయిపోయింది,
సామాన్యుడు ఇల్లు కట్టాలనుకుంటే రెవిన్యూ అధికారులు సామాన్యుడికి ఇవ్వని అనుమతులు మట్టితో వ్యాపారం చేసే వ్యాపారులకు ఎందుకు ఎలా అనుమతులు ఇస్తున్నారు అంటూ మండిపోటుకు గురవుతున్నారు
మునుముందు సామాన్యుడు ఇల్లు కట్టాలంటే అనుమతుల తోటి సతమతం చేస్తున్న రెవెన్యూ అధికారులు వేధిస్తున్న తీరు సామాన్యుల గుండెల్లో గుబులు రేగుతుంది
స్థానికంగా ఉన్న పోలీస్ శాఖ గాని రెవిన్యూ శాఖలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ మట్టి మాఫియా పై మౌనం వహిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని స్థానికులు గుసగుసలాడుతున్నారు,
అధికారుల సైతం ముడుపులు ముడితేనే స్పందన లేకుండా ఉన్నారని పలువురు చెవులు కోరుక్కుంటూన్నారు,
దళారులు మాత్రం ఆగేదే లేదు ఆపేదే లేదన్న తరుణంలో రెచ్చిపోతుంటే, వారు నడిపే వాహనాల వేగం సైతం ప్రజల గుండెల్లో గుబులు పుడుతుంది, రహదారి గుండా ప్రయాణించే సహా ప్రయాణికులు సైతం వారి వాహనాల వేగానికి వారి ఓవర్ లోడ్ కు బెంబేలెత్తిపోతున్నారు, ఇదంతా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై మండల వాసులు ఆగ్రహానికి గురవుతున్నారు,
కొందరైతే అనుమతులు ఒకటి ఉంటే మరో కార్యకలాపాలు చేసుకుంటూ సామాన్యుల నుంచి డబ్బులు గుంజటం లక్ష్యంగా పెట్టుకొని నిత్యం మట్టి దందాలో మునిగితేలుతున్న మహానులు ఎందరో,
పర్మిషన్ ఇచ్చారంటూ విచ్చలవిడిగా రహదారులను వెంట ప్రయాణించే ప్రయాణికులను పాదాచారులను భయభ్రాంతులను గురి చేయటం ఎంతవరకు సమంజసం కాదని స్థానిక మండల ప్రజలు తీవ్ర అగ్రహానికి గురవుతున్నారు, అనుమతుల మాటేమో గాని వారి వేగానికి మా ప్రాణాలు పోయేలా ఉన్నాయంటూ పాదాచార్యులు వాపోతున్నారు, ఎలాంటి ప్రమాదాలు జరగకముందే నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసే వారిపై, అక్రమ మట్టి దందా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :