బూర్గంపాడు, జూన్ 7 (వై 7 న్యూస్):
సారపాకలో సిపిఎం మండల కమిటీ సమావేశం జరగ్గా, భూభారతి గ్రామసభల్లో పారదర్శకంగా వ్యవహరించాలని పార్టీ డిమాండ్ చేసింది. మాజీ ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో జరిగిన అక్రమాలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు.
జిల్లా నాయకుడు ఎంబి నర్సారెడ్డి, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నిజమైన వారసులకు భూములు నమోదు కావడం లేదని, బినామీలకు రైతుబంధు లభించిందని విమర్శించారు. ఆదివాసీల భూములు ఇప్పటికీ ధరణిలో నమోదు కాలేదని, కొంతమంది అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ భూమి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ వారు డిమాండ్ చేశారు.
Post Views: 110









