తూప్రాన్, జూన్ 7 (వై 7 న్యూస్):
తూప్రాన్ ఈద్గా మైదానంలో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరిపారు. వేలాది మంది ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ నిర్వహించి దేశంలో శాంతి, ఐక్యత కోరుతూ ప్రార్థనలు చేశారు.
నమాజ్ అనంతరం ముస్లింలు పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. కుర్బానీ ఇవ్వడం, పేదలకు సహాయం చేయడం ఈ వేడుకలో భాగమయ్యాయి.పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, చిట్కుల మైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తదితరులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 40









