E-PAPER

వక్ఫ్ బోర్డ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ముస్లింలు

వై సెవెన్ న్యూస్ 30 బాన్సువాడ

బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డ్ చట్టానికి వ్యతిరేకంగా బాన్సువాడ తంజీముల్ మస్జీద్ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డ్ చట్టం వల్ల ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వెంటనే వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ఇంతియాజ్, ఎజాస్, వహాబ్, అలిమొద్దీన్ బాబా, యండి. దావూద్, అసద్ బిన్ మొహ్సిన్, అఫ్రోజ్, ముస్లిం యువకులు, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News