E-PAPER

అసెంబ్లీలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాల అమలు నిర్ణయం తీసుకోవాలి

మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఏరియా సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు చలిచాలని జీతాలతో కుటుంబ పోషణ మద్య కొట్టుమిట్టాడుతున్నారని , హైపవర్ వేతనాలు చెల్లంచేలా బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం చేయాలని, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ మణుగూరు
బ్రాంచి సెక్రటరీ వై. రాంగోపాల్ తెలంగాణ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
పి వీ కాలనిలోని కెయల్ మహేంద్ర భవన్ ఏఐటీయూసీ ఆఫిసులో జరిగిన కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తగుచర్యలు తీసుకోవాలని మజ్జిక ఒఆర్ యస్ ప్యాకేస్ అందించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. కాంట్రాక్టర్ల ఆర్థిక దోపిడీని అరి కట్టెందుకు ఆనాడు బ్యాంకుల ద్వారా జీతాలు ఇప్పించి సి యం పి యఫ్ వైద్యం అందించాలని పోరాటం చేసి సాధించమని అన్నారు. సీఎం పిఎఫ్ లెక్కల వివరాలు పూర్తిగా తెలియడం లేదని పూర్తి వివరాలతో కూడిన సి యం పి యఫ్ లెక్కల పాస్ బుక్ లు కాంటాక్ట్ కార్మికులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ మణుగూరు ఏరియా కార్యదర్శి ఆదేర్ల సురేందర్ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు ఏఐటీయూసీ చేసిందని లాభాల్లో నుండి ఐదు వేల రూపాయలు ఇప్పించిన ఘనత సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీదే అని అన్నారు. ఐ టి ఐ చేసిన కాంట్రాక్టు కార్మికుల పిల్లల గుర్థించి ఆపరేంటీషిప్ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. సింగరేణి సంస్థ పురోగాభివృద్ధికి పాటుపడుతూనే హక్కులకోసం ఐక్యంగా పోరాటం చేసి సాధించుకొవాలని పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యం అవుతాయని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ బెరర్ శనిగరపు కుమారస్వామి, స్టోర్స్ సివిల్ పిట్ సెక్రెటరీలు శరత్ శివ ,మరియు రాజెందర్, సమ్మయ్య, వీరబాబు, దుర్గారావు ,శ్రీను, రామకృష్ణ, ఆదాము సీతారాములు, ఉపేంద్ర ,ఈశ్వరి ,అలవేలు, భాష ,శ్రీవాణి ,ఇమామి, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News