E-PAPER

సంబరాలు జరుపుకున్నా మణుగూరు కాంగ్రెస్ శ్రేణులు

మణుగూరు, మార్చి 18 వై 7 న్యూస్;

పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అడవి అభివృద్ధి చైర్మన్ పోదెం వీరయ్య ల ఆదేశాలమేరకు మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ అధ్యక్షతన ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో సంబరాలు జరుపుకోవడం జరిగింది. అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ సోమవారం నాడు అసెంబ్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీసీ కులఘనన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం దేశంలోనే మొదటిసారిగా కుల ఘనన నిర్వహించి అసెంబ్లీ లో 42 శాతానికి పెంచుతూ బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు సి ఏం రేవంతరెడ్డి చిత్రపటానికి బి సి నాయకుల తో కలిసి పాలాభిషేకం నిర్వహించి, బాణాసంచా కాల్చి, స్వీట్స్ తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర లో అలాగే రాహుల్ గాంధీ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఉప సంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి,ఆమోదం కు ఓటు వేసి సహకరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు ప్రత్యేక ధన్యవాదములు అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో మణుగూరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ సైదులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐతనబోయిన సతీష్, మండల మహిళ అధ్యక్షురాలు సౌజన్య,జిల్లా కార్యదర్శి కనకలక్ష్మి,మండల నాయకులు పాలమూరు రాజు,గాండ్ల సురేష్,టివి సుబ్బారెడ్డి,పాల్వంచ రాములు,గోరంట్ల కనకయ్య,వెంకట్రావు గౌడ్, బీసీ నాయకులు సోమేశ్వరరావు గౌడ్, గుండగని నాగేశ్వరరావు, సాదిని సీతయ్య, ఙివి, మదడి రాజేష్ మహిళా నాయకురాలుశ్యామల,గౌతమీ, షబానా, పద్మ, రజిత, రవీందర్, రాంబాబు మండల నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్