E-PAPER

మాదిగల ఏళ్ళ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ బిల్లు

అసమానతల నిర్మూలనకే ఎస్సీ వర్గీకరణ

ప్రతి గడపకు ఎస్సీవర్గీకరణ లక్ష్యం తీసుకెళ్లాలి

సిద్దెల తిరుమలరావు మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి

మణుగూరు : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి మాదిగ ఉప కులాలకు న్యాయం చేస్తుందని,మాదిగల ఏళ్ళ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిందని,మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దెల తిరుమల రావు బుధవారం ఓ ప్రకటనలో
హర్షం వ్యక్తం చేశారు.అణిచివేతకు గురైన కులాల్లోని అసమానత
లను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ అని ఆయన అన్నారు.
వర్గీకరణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం కాదన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు కార్యకర్తలు వివరించాలన్నారు. ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలను తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవా
లని సూచించారు. డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో వర్గీకరణ కోసంఏళ్ల పాటు సాగిన పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీ మొదట్నుంచీ మద్దతుగా నిలిచిందని తిరుమల రావు గుర్తు చేశారు. 2006 నుంచి పెండిరగ్‌లో ఉన్న కేసులో, 2024 ఆగస్ట్‌ ఒకటిన తీర్పు వచ్చిందని, తీర్పు వచ్చిన గంట లోపలే వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్‌ ప్రకటన చేశారని,ఆ వెంటనే కేబినెట్‌ సబ్‌ కమిటీ, ఆ తర్వాత వన్‌ మ్యాన్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ను నియమించారన్నారు. మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి ఆధ్వర్యంలో 12 శాతం రిజర్వేషన్ల కోసం సాగిన పోరాటంలో నేడు 9 శాతం వర్గీకరణ సాధించుకొని మాదిగ జేఏసి తన జాతి కోసం చిత్తశుద్ధితో పనిచేసిందన్నారు. ఈ బిల్లుకు రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని పార్టీలు మ‌ద్ద‌తుnఇచ్చాయ‌ని,వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మాదిగల రిజర్వేషన్ కోసం ఏళ్లుగా పోరాటాలు చేశామని, ఈ పోరాటంలో చాలా మంది అమరులు అయ్యారని అన్నారు. మాదిగ ఉపకులాల వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని,ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అమరులైన వారి కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని, అంతేగాక త్వరలో అమలు చేయబోయే రాజీవ్ యువ వికాసం పథకంలో కూడా అమరులైన వారి కుటుంబంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు.మాదిగలలోని ప్రతి ఉప కులానికి న్యాయం చేసేలా వర్గీకరణ ఉందని తెలిపారు.మాదిగ సామాజిక వర్గాల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన ఈ తరుణాన్ని ప్రతి మాదిగ జాతి బిడ్డ పండుగలా జరుపుకోవాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్