E-PAPER

నిరాశ్రయుడికి సామగ్రి పంపిణీ

మణుగూరు:

మండలంలోని తిర్లాపురం పంచాయతీలో ఈ నెల 5వ తేదీన చింతలరాములుకు చెందిన పూరిల్లు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. పూర్తి నిరాశ్రయుడైన బాధితుడి గురించి విషయం తెలుసుకున్న వాసవీ క్లబ్ సభ్యులు బుధవారం దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రూ.5వేల విలువైన గ్యాస్ పొయ్యితో పాటు నిత్యావసరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాములు వాసవీక్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ అధ్యక్షుడు శ్యామ్, ఐపీసీ బండారు నర్సింహారావు, చిత్తలూరి రమేశ్, స్థానికులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్