E-PAPER

ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు…అడ్డుకున్న మున్సిపల్ అధికారులు,

తూప్రాన్ మే,2 వై సెవెన్ న్యూస్

తూప్రాన్ పట్టణంలో గల అవుసుల కుంట కు సంబంధించిన విలువైన శిఖం భూమిలో ఫ్రీడం పార్కు పక్కన అక్రమంగా జరుగుతున్న ఇంటి నిర్మాణం పనులను మున్సిపల్ అధికారులు అడ్డుకోని పనులను ఆపివేయించారు. సదరు స్థలంలో కట్టడాలపై ఫిర్యాదులు రావడంతో పనులు అపామనీ, ఆ స్థలాన్ని రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో కలిసి సర్వే చేయించి శిఖం స్థలం అని తేలితే అన్ని అనుమతులను రద్దుచేస్తామని మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి పేర్కొన్నారు. 447 సర్వేనంబరు కు సంబంధించిన శిఖం భూమి నివాస గృహాలకు అనుకోని ఉండడం,చాలా విలువ కలిగిన స్థలం కావడంతో కొందరు స్తానిక పెద్దలు ఆ భూమిపై కన్నేశారు. పక్కనున్న ప్రైవేటు స్థలం నంబరును చూపించి శిఖం భూమిపై అమ్మకాలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇట్టి భూమిలో కట్టడాలు మొదలుకాగా ఇరిగేషన్,రెవెన్యూ అధికారులు సర్వే జరిపి శిఖం భూమి కబ్జా జరిగిందని తేలడంతో అధికారులు భూమి చుట్టూ హద్దురాళ్లు పాతి a స్థలంలో హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటుచేశారు. మున్సిపల్ అధికారులు ఈ స్థలంలో ఫ్రీడం పార్కును ఏర్పాటుచేసి పక్కన కొద్ది స్థలాన్ని వదిలేశారు. ఇపుడు వదిలేసిన స్థలంలో ఓ వ్యక్తి బోరు వేసి,అన్ని అనుమతులు ఉన్నాయంటూ ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టాడు. గతంలో ఇదే వ్యక్తి కట్టడం పనులు చేపడితే అధికారులు పనులను అడ్డుకున్నారు. కొన్నాళ్లపాటు ఆపిన పనులను మళ్ళీ మొదలు పెట్టడంతో మున్సిపల్ అధికారులు పనులు ఆపేశారు. పట్టణంలో విలువైన శిఖం భూమి కబ్జాకు గురవుతుంటే చర్యలు చేపట్టవలసిన రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అవుసుల కుంట కు సంబంధించిన శిఖం భూమి రికార్డు ప్రకారం 3.20 ఎకరాల భూమి ఉండాలి.కానీ పెద్ద మనుషుల అండదండలతో కబ్జాదారులు ఆక్రమించుకోవడంతో ప్రభుత్వ భూమి అంతకంతకు తగ్గిపోతుంది.సర్కారు భూమిని కాపాడవలసిన అధికారులు బాధ్యతను విస్మరించి కబ్జాదారులతో కుమ్మక్కయి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనితో అవుసుల కుంట శిఖం భూమి అంతకంతకూ మాయమవుతోంది.గతంలో ఈ భూమిని సర్వే చేపట్టిన సమయంలో ముఖ్యమైన అధికారులకు,కొందరు పెద్దలకు పెద్ద మొత్తంలో ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందువల్లనే బహిరంగంగా ప్రభుత్వ స్థలంలో బోర్లు వేసి, యదేచ్చగా ఇంటి నిర్మాణం పనులు జరుగుతుంటే అడ్డుకోవలసిన రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు మెతక వైఖరి అవలబిస్తున్నారు. కట్టడాలు జరుపుతున్న స్తలం ఎవరిదన్న విషయంపై పకడ్బందిగా సర్వే జరిపి కుంట శిఖం భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించాలని స్థానికులు జిల్లా కలెక్టర్ కు విన్నవించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్