ఏపీ ఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 28వ రాష్ట్ర మహాసభ ఏప్రిల్ నెలలో ఒంగోలు లో నిర్వహించనున్న నేపథ్యంలో, మహాసభ విజయవంతం కోసం యూనియన్ సభ్యులకు ఆర్థిక సహకారంగా రూ.10,000 చొప్పున అందజేశారు.ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ బాబా మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణే యూనియన్ ప్రధాన లక్ష్యమని, ఉద్యోగుల ఐక్యతతోనే సంస్థ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర మహాసభను ఘనంగా నిర్వహించి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 7








