కొత్తగూడెం;
పాల్వంచ మండలం శ్రీకనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి గుడి) ఆలయ కమిటీ చైర్మన్ గా బాలినేని నాగేశ్వర రావు, కమిటీ సభ్యులుగా చీకటి కార్తీక్, సందుపట్ల రమ్యారెడ్డి తో పాటుగా పలువురిని నియమిస్తు దేవాదయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా తమకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లకు ధన్యవాదాలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు.
Post Views: 117









