E-PAPER

సీసిఎస్ పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 29 వై సెవెన్ న్యూస్;

ఈ నెల 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ ఐపిఎస్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న జిల్లా సిసిఎస్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకొని నిందితులను పట్టుకోవడంలో బాధ్యతగా విధులు నిర్వర్తించినందుకు గాను రాష్ట్ర డిజిపి గారు వీరికి ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.ఆంధ్రా-ఒరిస్సా అటవీ ప్రాంతాల నుండి అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసినందులకుగాను రాష్ట్రంలోనే అధికంగా భద్రాది కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నగదు రివార్డులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గంజాయిని రవాణా చేసినా,విక్రయించినా,కొనుగోలు చేసినా అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.గంజాయి అక్రమ రవాణా గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని ఈ సందర్బంగా ఎస్పీ కోరారు.

ఈ కార్యక్రమంలో సీసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్,రామారావు మరియు సిబ్బంది రవి,విజయ్,రామకృష్ణ,భాస్కర్, వెంకటనారాయణలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్