మణుగూరు, ఏప్రియల్ 25 వై 7 న్యూస్;
ఏరియా అధికార ప్రతినిధి ఎస్ రమేష్ విజ్ఞప్తి
శనివారం ఉదయం ఏడున్నర గంటలకు మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సింగరేణి వైద్య విభాగం మరియు సింగరేణి సేవా సమితి సంయుక్త నిర్వహణలో నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాన్ని రాజుపేట మరియు పీకే – 1 సెంటర్ ఏరియా ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని మణుగూరు ఏరియా అధికార ప్రతినిధి ఎస్ రమేష్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి భూ నిర్వాసిత ప్రభావిత గ్రామాలలో సింగరేణి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని అందులో భాగంగానే రాజుపేట లో కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నామని సింగరేణి ఏరియా హాస్పిటల్ వైద్యులచే వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు వారు తెలిపారు. సీజనల్ వ్యాధులపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు.