పినపాక,డిసెంబర్23 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన పోతురాజుల సాంబశివరావు వయస్సు 35 సం”లు అను వ్యక్తి నేడు (సోమవారం) అదే గ్రామానికి చెందిన ఒక బాలిక తన ఇంట్లో ఉండగా ఎవరూ లేని సమయం చూసి ఆమె ఇంట్లోకి వెళ్లి చెయ్యి పట్టుకుని శారీరకంగా బలవంతం చేయబోగా ఆమె అతని చేయి వదిలించుకుని బిగ్గరగా అరిచేసరికి ఇంటి నుండి పారిపోయినాడు. వెంటనే తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆమె తల్లి ఫిర్యాదు చేయగా అతనిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజకుమార్ తెలిపారు.
Post Views: 296