E-PAPER

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

పిట్లం డిసెంబర్ 23 వై సెవెన్ న్యూస్ తెలుగు

పిట్లం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలలో భాగంగా.సోమవారం పిట్లం మండలంలోని  ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు . కేక్‌ను కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగువారిని కూడా ప్రేమించమని క్రీస్తు ప్రబోధనల్లో  సమస్త అంశాలు సంక్షిప్తమై ఉన్నాయని అన్నారు.తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజా ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే  చెప్పారు.విద్య, వైద్యం విషయంలో క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడి నిరుపేదలకు సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు.సమాజ నిర్మాణంలో ఆదర్శవంతులుగా, విద్యార్థినీ విద్యార్థులను ఒక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆదర్శంగా నిలబడ్డారని అన్నారు.ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రమంతా నిర్వహిస్తోందని గుర్తుచేశారు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని చెప్పారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News