యు.కొత్తపల్లి;డిసెంబర్23( వై న్యూస్ ప్రతినిధి);
కొంతకాలం నుండి అరబిందో ఫార్మా కంపెనీ కి చెందిన వారు సముద్రంలోకి పైపులైన్ వేయడంతో మత్స్య సంపద అంతరించిపోతుందని మత్స్యకారులు ఆందోళన చేపడుతున్నారు ఇదే తరుణంలో ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా కొంతమంది మత్స్యకారులు అరబిందో ఫార్మా కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకుని 6 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలు లో భాగంగా కోనపాపేటలో సోమవారం మత్స్యకార నాయకులతో కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు అర్జిలి నాగేశ్వరరావు, నాగరాజు విలేకరుల సమావేశం లో పాల్గొని ఫార్మా కంపెనీ వారు డబ్బులు ఇవ్వలేదని అయితే ఎర్రిపల్లి దేవుడు అనే వ్యక్తి వ్యవహారాన్ని నడిపించినట్లు తెలిపారు మరి మిగతా నలుగురు మత్స్యకారులకు ఇచ్చి ఉండొచ్చేమో అని తెలిపారు అరబిందో ఫార్మా యాజమాన్యంతో ఎరుపల్లి దేవుడి అనే వ్యక్తి వ్యవహారాన్ని నడిపించాడని తెలిపారు ఇరుపల్లి దేవుడు ఆయన సమావేశానికి రాలేదని తెలిపారు. మత్స్యకారుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఉద్యమం నీరు కారుతోందని అరబిందో ఫార్మా కంపెనీ వారు మత్స్యకార గ్రామాల అభివృద్ధి చెందే విధంగా చేయాలి తప్ప కొంతమంది వ్యక్తుల్ని రహస్యంగా పిలిపించుకొని డబ్బులు వెరచూపి ఉద్యమాన్ని నీరుగారిచే ప్రయత్నం చేస్తున్నారని సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో క మత్స్యకార నాయకులు , పెద్దలు పాల్గొన్నారు









