మణుగూరు, డిసెంబర్ 6 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం, అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ మాట్లాడుతూ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత మైన వ్యక్తి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన దేశం ప్రశాంత మైన వాతావరణం లో జీవించాటానికి అయన రాసిన రాజ్యాంగం అని కొనియాడారు విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉద్యమించాలని అన్నారు. ఈకార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు శివ సైదులు, నాయకులు కూచిపూడి బాబు, గాండ్ల సురేష్, రహీంపాషా, రవీందర్, ఆవుల సర్వేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, గోరంట్ల కనకయ్య, పాల్వంచ రాములు,దొడ్డపనేని మధు,నాగేశ్వరావు,అప్పారావు,అబ్దుల్లా,శ్రీను, యాకూఅలీ, త్రిమూర్తి, వెంకట్రావు గౌతమీ, నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు









