E-PAPER

శబ్ద కాలుష్యం చేసే పొగ గొట్టాల తొలగింపు

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ (ఐ.పీ.ఎస్)

వై7 ప్రతినిధి (కాకినాడ జిల్లా):
తూర్పుగోదావరి జిల్లా ఉత్తర్వులు మేరకు గత వారం రోజులుగా వివిధ ప్రదేశములో రాజమండ్రి ట్రాఫిక్ పోలీస్ వారు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా శబ్ద కాలుష్యం కలుగజేస్తున్న 201 మోటార్ సైకిల్ లను గుర్తించి, ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రమాణాల కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం కలగజేసే మోటార్ సైకిల్ సైలెన్సర్లను ( పొగ గొట్టములు) తొలగింప చేసి మోటార్ వాహనం చట్ట ప్రకారం కంపెనీ అధికృత సైలెన్సర్లను బిగింపజేసి, వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి పంపడమైనదని రాజమండ్రి ట్రాఫిక్ డిఎస్పి యం. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఉత్తరువుల మేరకు అటువంటి శబ్ద కాలుష్యం కలుగజేయు సైలెన్సర్లను అమ్మినచో, చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని అన్ని ఆటోమొబైల్, షోరూములకు నోటీస్ జారీ చేయడమైనదన్నారు.
అదేవిధంగా నెంబర్ బోర్డు లేని మోటర్ వాహనములు కూడా తనిఖీ చేసి 54 మోటార్ సైకిల్, మరియు ఆటోలు గుర్తించి వాటిపై నెంబర్లు వ్రాయించి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడమైనదన్నారు. శబ్ద కాలుష్యం కలిగే వాహనములపైన, నెంబర్ బోర్డు లేని వాహనముల పైన ప్రతిరోజు తనిఖీ నిర్వహించబడునని, రెండోసారి కనుగొన్నచో చట్ట ప్రకారం అధిక మొత్తంలో జరిమానా విధించబడునని వాహన దారులకు తెలియజేయడమైనదని పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News