హరిషన్న ను కాదు దమ్ముంటే మమ్మల్ని అరెస్టు చేయండి
బి.అర్.ఎస్ రాష్ట్ర నాయకులు సిందే చంద్రం సవాల్
తూప్రాన్.డిసెంబర్,06. వైసెవెన్ న్యూస్
తెలంగాణ రాష్ట్రం లో పోలీస్ లు అతిగా వ్యవహరిస్తున్నారని, అరచేతిని అడ్డం పెట్టీ సూర్య కాంతిని ఆపలేరని, హరిషన్న ను కాదు దమ్ముంటే మమ్మల్ని అరెస్టు చేయండి అని బి.అర్.ఎస్ రాష్ట్ర నాయకులు సిందే చంద్రం సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిందే చంద్రం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువ ఎమ్మెల్యే పై అక్రమ కేసు పెట్టారని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు గారిని అరెస్టు చేయడం అప్రజాసామికం అని అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు అని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టాలి కానీ పాలన చేతకాక ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు పెట్టించి అరెస్టు చేయడం అప్రజస్వామికం అని విమర్శించారు. మీ అక్రమ అరెస్టులకు బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదు అని హెచ్చరించారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజా క్షేత్రంలో అడుగుతూనే ఉంటాం అని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన మా యువ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి మా నాయకుల కోసం పోరాటం చేస్తాo అని స్పష్టం చేశారు. మీ హామీలు అమలు చేయించే క్రమంలో జైలుకైనా పోవడానికి సిద్ధం అని తెలియజేశారు.