E-PAPER

ప్రశాంతంగా పోలింగు మెటీరియల్ తరలింపు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణినీ పరిశీలించిన కలక్టర్ ప్రశాంతి

పర్యవేక్షణ చేసిన సహాయ రిటర్నింగ్ అధికారి టి. సీతారామ మూర్తి , ఆర్డీవోలు ఆర్. కృష్ణ నాయక్ , రాణి సుస్మిత…

ఉమ్మడి తూర్పుగోదావరి వై7 ప్రతినిధి :
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 20పోలింగు కేంద్రాలు, ఎనిమిది రూట్ల లో ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది, పోలింగ్ బాక్స్ లు, గురువారం ఉదయం 8 గంటల నుంచి సా 4 గంటల వరకు జరిగే పూర్వపు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరీ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళడం జరిగిందనీ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉభయ గోదావరీ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందన్నారు. డిసెంబరు 5 గురువారం బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు , సంబంధిత అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళడం జరిగిందనీ తెలిపారు. పొలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తదుపరి ఆయా పోలింగ్ సామాగ్రి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రీసీప్షన్ కేంద్రానికి తరలించి, బ్యాలెట్ బాక్సు, ఇతర పత్రలు భద్రపరచనున్నట్లు తెలిపారు. తదుపరి వాటిని అత్యంత భధ్రత మధ్య కాకినాడ కు తరలిస్తామని తెలియ చేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9 వ తేదీన కాకినాడ లో నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సహాయ రిటర్నింగ్ అధికారి/ జిల్లా రెవిన్యూ అధికారి టి సీతా రామ మూర్తి వివరాలు తెలియ చేస్తూ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం
తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం ఓటర్ల సంఖ్య..2904 మంది కాగా పురుషులు.. 1597 మంది, మహిళలు. 1307 మంది ఉన్నారన్నారు. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్ తరలింపును, సిబ్బంది , ఇతర అనుబంధ విధులను ఆర్డీవో లు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, అర్బన్ తహసిల్దార్ పాపారావు, ఎలక్షన్ సూపరింటెండెంట్ జి ఎల్ ఎస్ దేవి, డీటి శాస్త్రి ఇతర అధికారులు పర్యవేక్షణ చెయ్యడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాల వివరాలను ఆయన తెలిపారు. రంగంపేట మండలం లో తాహసిల్దార్ కార్యాలయం, గోకవరం మండలం  మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, కోరుకొండలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంను, (మండల విద్యా వనరుల కేంద్రం, మీటింగ్ హాల్), సీతానగరంలో  మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం అర్బన్ లో  తహశీల్దార్ కార్యాలయంలో స్టాఫ్ హాల్ తూర్పుగోదావరి వైపు, రాజమహేంద్రవరం అర్బన్ లో తహశీల్దార్ కార్యాలయం, స్టాఫ్ హాల్, పశ్చిమ వైపు, రాజమహేంద్రవరం రూరల్ శ్రీమతి బొప్పన  సావిత్రమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్ హుక్కుంపేట, రాజానగరంలో మండల మహిళా సమాఖ్య , మీటింగ్ హాల్, కడియంలో మండల పరిషత్తు  అభివృద్ధి అధికారి కార్యాలయం, బిక్కవోలులో మండల పరిషత్తు  అభివృద్ధి అధికారి కార్యాలయం, అనపర్తిలో  మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, తాళ్లపూడిలో శ్రీ పరస పద్మ రాజారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోపాలపురం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, నల్లజర్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, దేవరపల్లి మండల ప్రజా పరిషత్ ఎలిమెంటరీ స్కూల్, చాగల్లులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొవ్వూరులో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, నిడదవోలులో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఉండ్రాజవరంలో తహశీల్దార్ కార్యాలయం వెనుక గన్నమన శేషగిరిరావు ద్వారకా భవనం, పెరవలిలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో ఎంఎల్సి ఎన్నికల నిర్వహణ జరిగినట్టు ఆయన వివరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్