E-PAPER

అంగన్వాడీ కేంద్రం 7 లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తూప్రాన్, మార్చి, 8. వై సెవెన్ న్యూస్

తూప్రాన్ పట్టణంలోని 7వ అంగన్వాడీ కేంద్రం లో అంగన్వాడీ టీచర్ ఇందిర ఆధ్వర్యంలో శనివారం ఉదయం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 7వ అంగన్వాడీ కేంద్రం లో మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ఇందిర మాట్లాడుతూ మహిళా దినోత్సవ విశిష్టత గురించి వివరించారు. బాలిక చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం భాగుపడ్తుందని, బాలికల చదువు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్