తూప్రాన్, మార్చి, 8. వై సెవెన్ న్యూస్
తూప్రాన్ పట్టణంలోని గీతా మందిరంలో ఈ నెల 9 ఆదివారం 17వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు గీతామందిర్ నిర్వాహకులు తెలిపారు. 9వ తేదీ ఆదివారం ఉదయం 7:25 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గణపతి పూజ, స్వస్తి వాచనం, రక్షా బంధనం, పంచగవ్యప్రాశన, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, మాతృక, యోగిని వాస్తు, క్షేత్ర పాలక, నవగ్రహ, సర్వతో భద్ర, మంటపాల దేవతా స్థాపన, ప్రధాన కలశ స్థాపన, శ్రీ గోపాల కృష్ణ స్వామి వారికి అష్టోత్తర శత కళాశార్చన, మహాభిషేకం, గణపతి పంచ సూక్త హవనములు, రుద్ర హోమము, స్థాపిత దేవతా మూల మంత్ర హవనం, హోమబలి ప్రధానం, పూర్ణాహుతి, శ్రీ రుక్మిణీ కృష్ణ కళ్యాణం, తీర్థ ప్రసాదాలు వితరణ, ఋత్విక్ సన్మానం, మహదాషిర్వాదం, అనంతరం పరివ్రాజకా చార్య గురు మధనానంద పీఠా దీశ్వరులు శ్రీశ్రీశ్రీ మాధవానంద స్వామి వారి అనుగ్రహ భాషణం ఉంటుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట కు అన్న ప్రసాద వితరణ అన్న దాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.