బాన్సువాడ డిసెంబర్ 04 వై 7 న్యూస్ తెలుగు
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలను బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా విద్యార్థులను పాఠ్యాంశాల బోధనపై అలాగే భోజన విషయంపై పాఠశాల నిర్వహణ తీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ ఏ విషయంలోనైనా మెరుగైన సేవలు అందజేయాలని ఆమె అన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రార్థన సమయంలో మనిషి చదువుకుంటేనే పురోగతి సాధించగలరని చదువు విషయంలో అజాగ్రత్త వహించకూడదని ఆమె విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు సిబ్బంది ఉన్నారు.
Post Views: 93









