మణుగూరు డిసెంబర్ 4 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల ఓపెన్ కాస్ట్ నందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఫిట్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ వై రాంగోపాల్ మాట్లాడుతూ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత గత నెల 28 వ తారీకున మేనేజ్మెంట్ తో స్ట్రక్చర్ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ స్ట్రక్చర్ సమావేశంలో మైనింగ్ టెక్నికల్ సూపర్వైజర్లకు మెడికల్ అన్ఫిట్ అయితే సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని డిస్మిస్ అయిన JMET లను అందరిని తిరిగి తీసుకోవడానికి అంగీకరించారని
ప్రైవేట్ వారితో నడిపిస్తున్న క్యాంటీన్ లను క్వాలిటీ మరియు క్వాంటిటీ పెంచి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా క్యాంటీన్ సౌకర్యం కల్పించడానికి, క్యాంటీన్లను కూడా కంపెనీ ఏ నిర్వహించడానికి అంగీకారం కుదిరిందని అన్నారు.మెరిట్ స్కాలర్షిప్ ర్యాంకును 2000 ర్యాంక్ నుండి 8000 పెంచడానికి అంగీకరించారని,కొత్త ఇన్సెంటివ్ విధానానికి కమిటీ వేసి పరిష్కరిస్తామని వేజ్ బోర్డులో లేని 11 రకాల అలవెన్స్ లను పెంచడానికి అంగీకరించారని,క్యాడర్ స్కీం పై మూడు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని, డిసెంబర్ నుండి మార్చి వరకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని యూనియన్ చేసిన డిమాండ్ కు యాజమాన్యం అంగీకరించిందని
Ep ఆపరేటర్లకు వేకెన్సి తో సంబంధం లేకుండా టైం బాండ్ ప్రమోషన్ ఇవ్వడానికి అంగీకరించాలని
N-1, N/2 విషయంలో బోర్డు లో చర్చిస్తామని మారుపేర్ల మార్పిడి, విజిలెన్స్ పేరుతో నిలిచిన డిపెండెంట్ లకు సి&ఎండితో జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మేనేజ్మెంట్ తెలిపిందని తెలిపారు.మొత్తం 13 సమస్యలపై చర్చించడం జరిగిందని సొంత ఇంటి పథకం, పెర్క్స్ ఫై ఇన్కమ్ టాక్స్ తదితర అంశాలపై
సి అండ్ ఎండితో జరిగే సమావేశాల్లో చర్చిస్తామని అన్నారు.ఒకవైపు నిలిచిపోయిన స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహిస్తూ కార్మికుల సమస్యలు పరిష్కారం కొరకు ప్రయత్నిస్తుంటే కొన్ని సంఘాలు AITUC ఫై తప్పుడు ప్రచారం చేస్తూ కార్మికులను తప్పు ద్రోవ పట్టించే
ప్రయత్నం చేస్తున్నాయని వారి మాటలను నమ్మవద్దని అన్నారు.మణుగూరు ఏరియాలో గత పది సంవత్సరాలుగా కొత్త మైన్
ఏర్పాటుకు గత గుర్తింపు సంఘం ప్రయత్నం చేయలేదని, కేవలం తమ పైరవీలు, దందాలు చేసుకుంటూ కాలం గడిపారని తెలిపారు,
సర్కారు సంఘాలతో సమస్యలు పరిష్కారం కావని కేవలం కార్మికుల కోసం పోరాడే ఎర్రజెండా యూనియన్ AITUC తోనే సాధ్యమని అన్నారు.యూనియన్ బలోపేతానికి చందా రాసిన కార్మికులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.మణుగూరు ఓసీలో కార్మికులు ఎదుర్కొంటున్నసమస్యల పరిష్కారానికి యూనియన్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని మేనేజ్మెంట్ కూడా సహకరించాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ సమావేశంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మల్లెల వెంకట రామ నరసయ్య, ఆఫీస్ బేరర్ ఆవుల నాగరాజు, ఫిట్ సెక్రటరీ సాయి ప్రకాష్ చారి, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ దాట్ల సందీప్, సుధాకర్ cసుధాకర్, రమేష్, త్రినాథ్ కంది శంకర్,రెడ్డి, పరమేష్,బిచ్చు ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.