కత్తిగూడెం ఇసుక రాంప్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని తిరగబడ్డ జనం
చర్ల ,డిసెంబర్ 04 వై 7 న్యూస్
నిబంధనలకు పాతర వేసి ఇష్టరీతిన నడపడుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లోని సి కత్తిగూడెం ఇసుక రాంప్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే నిర్వాహకులకి వత్తాసు పలుకుతు నిబంధనలకు తిలోదకాలు వదిలారంటూ తిరగబడ్డ జనం.
ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగానే పాలకులు అధికారులు వ్యవహరిస్తున్నారు.ఇసుక ర్యాంపు తొలకాలలో కాంట్రాక్టర్ల కంటే అధికారులు ఎక్కువ చరవ చూపుతున్నారని అర్థమవుతుంది.సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
చర్ల మండలం కత్తిగూడెంలో బుధవారం వెంకటాపురం నుంచి భద్రాచలం కు వెళ్లే బస్సులో ఒక మహిళ ప్రెగ్నెన్సీ నొప్పులతో బాధపడుతూ ట్రాఫిక్ జాములో ఇబ్బంది పడింది పాత పద్ధతిలోనే ఈరోజు కూడా ఇసుక లారీలు రోడ్లపై నిలిచిపోవడంతో అనేక వాహనాలకు ప్రజలకు ఇబ్బందిగా ఏర్పడిందని ఈ విషయంలో అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా సీ కత్తిగూడెంలో ఇదే పద్ధతిలో వాహనాలు ఆగిపోతే ఎమ్మెల్యే తెల్లo వెంకటరావుకి మరియు అధికారులకి మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని కంటే ఎక్కువగా అధికారులు పాలకులు కాంట్రాక్టర్లకే పరిమిషన్లు ఇస్తున్నారని వారి దతత్తుగా వ్యవహరిస్తున్నారని వారి తరఫున నిలబడుతున్నారని ఈరోజుతో తేట తేలమైందని ఆయన అన్నారు. ప్రజలందరూ గతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఇసుక లారీలను ఈ రోడ్ల మించి పోనివ్వకుండా సౌకర్యంగా రోడ్లు ఉండేటట్టు చూడాలని ఎందుకంటే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో అంబులెన్స్లు బస్సులు రవాణాకి ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి యధావిధిగా రోడ్లమీదనే వాహనాలను పంపిస్తున్నారని దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈరోజు కూడా ఇసుక లారీలు రోడ్లపై ఆగిపోవడంతో ప్రజలు ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. కాంట్రాక్టర్ల కంటే అధికారులే ఈ విషయంలో ఎక్కువ చొరవ చూపుతున్నారని వారి వాటం ఎంతో తేట తెల్లం కావాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు అనేకసార్లు ప్రజాభిప్రాయాలు భాగంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు పాలకులకు తెలియజేశామని ఇక దశల వారి ఆందోళన మొదలుపెడతామని రేపటి నుంచి ఇసుకల లారీలని ఇసుక కాంట్రాక్టర్లని ఇసుక దందాను అడ్డుకుంటామని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్పురం జిల్లా నాయకులు గొంది ముయ్యన్న ప్రజలు తదితరులు పాల్గొన్నారు









