ఎంఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు
మెక్కా సాయిమాదిగ
బాన్సువాడ డిసెంబర్04 వై సెవెన్ ఫోర్ న్యూస్ తెలుగు
బాన్సువాడ మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మోక్క సాయి మాట్లాడుతూ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వర్గీకరణ వ్యతిరేకులారా ఖభర్దార్ తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎంఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మెక్కా సాయిమాదిగ అన్నారు.ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేసి సామాజిక న్యాయమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించిన యోధుడు మందకృష్ణ మాదిగ ని వర్గీకరణను వ్యతిరేకించే స్వార్ధపరులైన కొందరు మాల మనువాదులు రిజర్వేషన్ల దోపిడీకి మరిగి 58 కులాల వాటాను ఒక్క కులమే గత 30 సంవత్సరాలుగా అనుభవిస్తూ వ్యక్తిగతంగా మందకృష్ణ మాదిగ ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.రాష్ట్రపతి, ప్రధానమంత్రులు, సుప్రీంకోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనం, ముఖ్యమంత్రులు,వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా,కుల,విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసి కూడా స్వార్థ బుద్ధితో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం కోసమే స్వలాభం కోసం పరెడ్ గ్రౌండ్లో మాలల సభను నిర్వహించారని అన్నారు
మందకృష్ణ మాదిగ మీద ఇలాగే అవాకులు చవాకులు పేలితే వ్యక్తిగతంగా విమర్శిస్తే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ బాన్సువాడ ఎస్సీ హాస్టల్ అధ్యక్షులు గంగాధర్ నాయకులు శ్రీకాంత్,రవి,సాయిలు,మనోజు తదితరులు పాల్గొన్నారు.