బూర్గంపహడ్,డిసెంబర్04 వై 7 న్యూస్;
ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో సి.పి.ఎం. పార్టీ బూర్గంపహాడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సమస్యలతో వినతి పత్రం అందజేయడం జరిగింది. తాళ్ళ బొమ్మూరు ఫంక్షన్ హాల్ లో నిన్న సాయంత్రం సి.పి.ఎం. పార్టీ మండల కార్యదర్శి ,బత్తుల. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని సుందరయ్య నగర్ సమస్యలతో పాటు మండలంలో ఉన్న స్థానిక సమస్యలను కూడా పరిష్కారం చేయాలని అన్నారు. మహిళలకు నెలకు 2500లు అమలు కాలేదని ఉపాధి కార్మికులకు 12000 ఇంకా ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు అమలు చేయాలని, పాత పింఛన్లు 4000, వికలాంగులకు 6000 అమలు చేయలేదని అన్నారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు .అదే కాకుండా ప్రభుత్వం తులం బంగారం ఆడపడుచులకు కానుక ఇస్తానని అన్న మాటను నిలబెట్టుకోవాలని, గ్యాస్ సబ్సిడీ ప్రజలకీ నేరుగా 500 సబ్సిడీని ఇవ్వాలని ,బ్యాంకుల్లో సబ్సిడీ డబ్బులు పడటం లేదని దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని, కౌలు రైతులకు 12000 ఇస్తానన్న ప్రభుత్వం అవి అమలు చేయలేదని, రైతు రుణమాఫీ కానీ రైతులు ఉన్నారని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐ .టి. సి .పి .ఎస్. పి. డి .లో స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యుడు పాపినేని సరోజ ,ఎస్. కె. ఆ బీద, మీనా కుమారి ,బి .లక్ష్మి ,బి .పద్మ నాగమణి, రజిత స్వరూప రాములమ్మ మంజుల తదితరులు పాల్గొన్నారు.