ఎన్ ఎస్ ఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ డిమాండ్
మణుగూరు డిసెంబర్ 1 వై 7 న్యూస్
చలి తీవ్రత పెరుగుతున్న దృశ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు, కస్తూరిబా, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో, ఆశ్రమ పాఠశాలల్లో ఉంటున్నటువంటి. విద్యార్థిని, విద్యార్థులకు స్వెటర్స్ మరియు దుప్పట్లు బ్లాంకెట్లు పంపిణీ చేయాలని, ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు. ఈ సందర్భంగా దుర్గం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ సిఎస్ టి బీసీ మరియు కస్తూర్భా గురుకులలో, ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చలి తీవ్రత పెరుగుతున్న తరుణంలో, ప్రతి హాస్టల్లో కిటికీలు, వెంటిలేటర్ లు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్ ,బాడిశ సుహష్,జాడి దినేష్ దుర్గం సురేందర్ గోగు సాంబశివరావు, జాడి వినయ్ దుర్గం ప్రసాద్ గోగు సాయి తదితరులు పాల్గొన్నారు.