సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం డిసెంబర్01 వై సెవెన్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,డిసెంబర్ 5 న గురువారం రోజు మండల కేంద్రంలో జరిగే ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు..
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తి అయిన సందర్భంగా మండలంలో ఏర్పాటు చేస్తున్న ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు విచ్చేయుచున్నారని, కావున ఈ నెల 5న ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరుతూ, ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్,మాజీ ఉపసర్పంచ్ కోరం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు వాసిరెడ్డి నేతాజీ , మండల నాయకులు భూక్య అర్జున్, బరపట్టి వెంకన్న, దెంచనాల రాజేంద్రప్రసాద్ , వగలబోయిన శ్రీను, దొంతూ మల్లయ్య,గాంధర్ల రామనాథం, జిమ్మిడి నవీన్ , దుర్గం కన్నయ్య, సుతారి రంగయ్య, తదితరులు పాల్గొన్నారు…