హైదరాబాద్, డిసెంబర్ 01 వై సెవెన్ న్యూస్
కన్నడ బుల్లితెర నటి శోభిత (32) ఆత్మహత్య చేసుకున్నారు. భర్తతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న శోభిత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె కన్నడలో పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపుపొందారు. శోభిత భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. శోభిత మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. శోభిత మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు._
Post Views: 24