ప్రభుత్వాలు మారుతున్న ఈ పాఠశాల మాత్రం మార్పులు చేర్పులకు నోచుకోలేదు
అయ్యా కలెక్టర్ గారు జర ఇటుచూడండి సారు అంటున్న గ్రామస్తులు!
బూర్గంపాడు,నవంబర్26 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామం.ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం.కృష్ణ సాగర్ కి కొంచెం దూరంలో ఎస్టీ కాలనీ ఉంది ఈ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉన్న సౌకర్యాలు మాత్రం లేక నానా అవస్థలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉపాధ్యాయులు.ఆ గ్రామంలో 35 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకి రోజు విద్య నేర్చుకునేందుకు వస్తూ ఉంటారు విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉంటారు.ఒకే గదిలో పిల్లలు ఉపాధ్యాయులు సామాగ్రి వంటసామాగ్రి అన్నీ కలిపి ఉండటం ఇక్కడ పాఠశాల విశేషం.
ఈ స్కూలుకి మరో రూము అవసరం ఉన్న ఎప్పటి వరకు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదు ఒకే గదిలో సామాగ్రి తో పాటు చదువులు కూడా చెప్పే పరిస్థితి ఉపాధ్యాయులకు తప్పడం లేదు. పిల్లల కూడా తప్పని పరిస్థితుల్లో ఆ ఒక్క గదిలోని చదువును చదువుకునే పరిస్థితి ఏర్పడింది.
అటవీ ప్రాంతం కావడంతో ఆ వైపుగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా లేని పరిస్థితి ఏర్పడింది.ఉపాధ్యాయులు తమ ఇబ్బందులు పిల్లల ఇబ్బందులు ఇప్పటివరకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన దాఖలాలు లేవు.భావితరానికి మంచి భవిష్యత్తు ఇవ్వవలసిన ప్రభుత్వ అధికారులు కేవలం 35 మంది విద్యార్థులకు ఒకటే గదిలో విద్యను బోధించడం ఇబ్బందికరమైనటువంటి విషయం.ప్రభుత్వాలు మారుతున్న ఈ పాఠశాల మాత్రం మార్పులు చేర్పులు కు నోచుకోలేదు మరో గది అవసరం ఉన్న అవసరం తీరక ఒకే గదిలో విద్యార్థులు ఉపాధ్యాయులు గడపాల్సిన పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు అధిక సంఖ్యలో వచ్చేందుకు పాఠశాల ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ఆదిశగా అడుగులు పడలేదని తెలుస్తోంది.ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్న ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తు మాత్రం అలాగనే ఉండటం విచిత్రం. అందులోనూ ఆ ప్రాంతం అటవీ ప్రాంతంలో ఉండటంతో అధికారులు కూడా అంతంత మాత్రమే ఆ వైపు పరిశీలన చేస్తూ ఉండటం ఇందుకు ప్రధాన కారణం.విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తేనే వారు రేపటి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది మంచి భవిష్యత్తు కూడా లభించే అవకాశం ఉంటుంది.ఇకనైనా బుర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ ఎస్టీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిని గమనించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చాలని జిల్లా కలెక్టర్ ను ఆ ప్రాంతవాసులు కోరుతూ ఉన్నారు.









