E-PAPER

భద్రాద్రి జిల్లాలో ఐక్యతతో ముందడుగు వేస్తున్న బీసీ సంఘాలు

జిల్లాలో ఈ నెల 27న కులగణన పై చైతన్య సదస్సు

హాజరుకానున్న బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీలంత కదలి రావాలి అంటూ పిలుపు

మణుగూరు,నవంబర్ 26 (వై 7 న్యూస్ ప్రతినిధి);

తెలంగాణ రాష్ట్రంలో ఓసి ఉప కులాలైన ఓసి పెద్దలు 10 శాతం లేని జనాభా వారు రాజకీయ పదవులు అనుభవిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారు.సంక్షేమ పథకాలు సదువుకున్న మేధావుల ఉద్యోగాలు అడ్డదారిలో అగ్రవర్ణాలకి చెందుతున్నాయి దాంతో చదువుకున్న యువత నిరుపేద గానే మిగిలిపోతున్నారు. దాంతో నిద్ర లేచిన బిసి సమాజం ప్రతి జిల్లాలో మనమంతా ఒక్కటే అంటూ ఐక్యతతో ముందడుగు వేస్తుంది వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ కులగణన చెయ్యాలి అంటూ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సర్వే జరపాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే మొదలుపెట్టింది త్వరలోనే బిసి జనాభా ఐక్యతతో ముందడుగు వేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1937 సంవత్సరంలో మాత్రమే బీసీల లెక్కలు తీయడం జరిగింది. అప్పటినుండి బీసీ లెక్కలు శాస్త్రీయంగా లేకపోవడంతో విద్య ఉద్యోగ రాజకీయ మరియు సామాజిక రంగాలలో బీసీలకు ఎక్కువగా అన్యాయం జరుగుతూ వస్తుందని దేశవ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలి అంటూ అనేక బీసీ సంఘాలు ప్రత్యేకంగా ఉద్యమాలు చేస్తూ డిమాండ్ చేస్తున్నాయి అయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లేరేషన్ లో ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన అంకురార్పణ జరిగిందని ఇప్పుడు జరుగుతున్న కులగణన తో రాష్ట్రవ్యాప్తంగా బీసీలను చైతన్యవంతులు చేయడానికి ప్రతి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఐక్యతతో ముందడుగు వేస్తుంది అందులో భాగంగానే జాతీయ అధ్యక్షులు బూజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు సమగ్ర బిసి చైతన్య సదస్సులు ఏర్పాటు చేశారు అంటూ బీసీ సంఘం నాయకులు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి బుర్ర సోమేశ్వరరావు గౌడ్ బీసీ సంఘం నాయకులు వీరంకి వెంకట్రావు పెనుగొండ సాంబశివరావు నాగరపు సతీష్ కుమార్ ఎండి గౌస్ పాషా జీవీ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఐక్యతతో ముందడుగు వేయాలని వారు పిలుపునిచ్చారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్