E-PAPER

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు బ్రిడ్జ్ ఎత్తు పెంపు

ఎల్లారెడ్డి నవంబర్ 25 వై సెవెన్ న్యూస్ తెలుగు

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామం వద్ద కళ్యాణి ప్రాజెక్టు వెళ్లే కాలువ పైన ఉన్న బ్రిడ్జ్ వర్షాకాలంలో నీటి ప్రవాహం బ్రిడ్జి పైనుండి పొంగి వెళ్తుంది. కావున అటువైపు ఉన్న గ్రామాలు వెళ్ళుట్ల, వెల్లుట్ల పేట, రత్నాపూర్, తిమ్మారెడ్డి, తిమ్మారెడ్డి తండా, అజాంబాద్, వెల్లుట్ల వెంకటాపూర్, పలు గ్రామాలకు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్న తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించారు. వెంటనే రోడ్డు భవనాల శాఖ అధికారులు డి ఈ నారాయణ ఏఈ ఐశ్వర్య కళ్యాణికి ప్రాజెక్టు లోకి వెళ్లే వాగు తిమ్మారెడ్డి దగ్గర ఉన్న వాగు పై బ్రిడ్జ్ ఎత్తు పెంచడానికి కొలతలు తీసుకుని ప్రతిపాదనలు పంపడం జరిగింది.ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతామని రోడ్డు భవనాల శాఖ అధికారులు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజి జడ్పీటీసీ సామేల్, తిమ్మారెడ్డి గ్రామ అద్యక్షులు జక్కీ కిష్టయ్య తదితరులున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్