మహిళా వంచోత్తవ సభగా తెలంగాణ సమాజం భావిస్తుంది
చందూరి హనుమాన్లు బిజెపి కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి
నసులాబాద్ నవంబర్ 22 వై సెవెన్ న్యూస్ తెలుగు
నసుల్లాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో చందూరు హనుమాన్లు మాట్లాడుతూ మహిళాల కోసం ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సభలు నిర్వహించడం సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు రక్షణ కరువైంది ఎందుకంటే మహిళ లపై దాడులు హత్యలు,ఆత్యాచారాలు ఏమి తగ్గలేదు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు హోంమంత్రి నియమించలేదు తమ మేనిపేస్టోలో పెట్టినటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500,డిగ్రీ చదివిన విద్యార్థినీలకు స్కూటీ,కళ్యాణ లక్ష్మి పథకం లో ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం, అంగన్ బడిలో పనిచేసే మహిళలకు 18000 జీతం, స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలను 10 లక్షలకు పెంచేలేదు, మహిళల పేర్ల పైన ఇస్తాను అని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు,మహిళల పేరుతో కొత్త రేషన్ కార్డు ఇస్తామని ఇవ్వలేరు కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల వంటిటీ బాధల నిర్మూలన కోసం కోసం ఉచిత సిలిండర్లు, మహిళా ల ఆత్మగౌరవం కోసం ఉచిత మరుగుదొడ్లు, బ్యాంకు ఖాతాలు, సుకన్య సమృద్ధి యోజన కేంద్ర మంత్రివర్గంలో మహిళా లకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఇద్దరికే మంత్రి వర్గం లో స్థానం కల్పించారు ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్ ఎంతవరకు మహిళలకు స్థానం కల్పించారు అదేవిధంగా వి సీ నియమకంలో ఒకరికి కూడా మహిళలకు స్థానం కల్పించలేదు ఉన్నత విద్యా మండలి లో కూడా అవకాశం ఇవ్వలేదు మహిళా సాధికారత కోసం బెల్ట్ షాపులు, పబ్బులు, డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనివల్లనే ఎంతోమంది మహిళల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ప్రభుత్వానికి తెలవదా అదేవిధంగా ఒంటరి మహిళలకు, భర్త చనిపోయిన వారి మహిళలకు పింఛన్ లు పెంచుతామని చెప్పి పెంచలేదు కొత్త పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు దీని దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలపై గౌరవం, బాధ్యత లేదని విషయం అర్థమవుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళ లకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాత మహిళా విజయోత్సవ సభలు నిర్వహించుకోవాలని గుర్తు చేసారు..