అంచనాల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
మండపేట నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల
తొలి సారిగా క్యాబినెట్ ర్యాంక్ పదవి…
వై 7 ప్రతినిధి (అంబేద్కర్ కోనసీమ జిల్లా) :
అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు క్యాబినెట్ ర్యాంక్ పోస్టు ఖరారయింది. ఆయన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌గా నియమితులు కానున్నారు. ఈ మేరకు ఆయనకు ప్రభుత్వం నుండి సమాచారం అందింది. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జోగేశ్వరరావు .. తొలుత మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో అప్పటి ఆలమూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో మండపేట నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పటి నుండి వరుసగా (2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో) ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆ జిల్లా వాసులు, ఆయన అభిమానులు భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో వేగుళ్లకు క్యాబినెట్ ర్యాంక్ కట్టబెట్టేందుకు చంద్రబాబు నిర్ణయించి, అంచనాల కమిటీ చైర్మన్‌గా మంత్రివర్గం ఎంపిక చేసింది. అధికారికంగా ఈరోజు అసెంబ్లీలో చైర్మన్‌తో పాటు మరో 8మంది సభ్యులతో అంచనాల కమిటీని ప్రకటించనున్నారు. 2009 నుండి అనేక కమిటీల్లో సభ్యుడుగా వేగుళ్లకు పని చేసిన అనుభవం ఉంది.