బిఆర్ఎస్ నేత రాపోలు నవీన్ కుమార్ విజ్ఞప్తి
హుజూర్ నగర్, నవంబర్ 21 వై7 న్యూస్;
భావి భారత పౌరుల భవిష్యత్తుతో పాలకులు చెలగాటం ఆడవద్దని బిఆర్ఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.గురువారం నాడు నేరేడుచర్లలో సందర్శనకు వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబుకు వినతిపత్రం ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల లోనూ కలుషిత ఆహారాన్ని భుజించడం వల్ల వందల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారని సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వానికి ఎందుకు అంత అలసత్వమని ఆయన ప్రశ్నించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటిఎన్నో సంఘటనలు జరిగాయని, ప్రభుత్వం విచారణకు ఆదేశించి చేతులు దులుపుకుంటుందని అందువల్ల ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయని దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టకపోతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని పిల్లలపై ఎంతో ఆశలు పెంచుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లోనూ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలోనూ చేర్పిస్తున్నారని, కాబట్టి తల్లిదండ్రులను నమ్మకం వమ్ము కాకుండా ఉండాలంటే ప్రభుత్వం అన్ని గురుకుల మరియు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ల కు ప్రత్యేక అధికారులను నియమించి నిరంతరం పర్యవేక్షణలో ఉంచాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే అందుకు సంబంధించిన ఉద్యోగులను బర్తరఫ్ చేయాలని ఆయన తన వినతి పత్రంలో డిమాండ్ చేశారు