E-PAPER

గుండెపోటుతో మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మిక వేత్త నేతి అంజయ్య గుప్త

తూప్రాన్, నవంబర్,21. వై సెవెన్ న్యూస్

తూప్రాన్ గ్రామ పంచాయితీ మాజీ వార్డ్ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మిక వేత్త అయిన నేతి అంజయ్య గుప్త గురువారం తెల్లవారుజామున 4:30 గంటలకు గుండె పోటుతో మరణించారు. అంజయ్య గుప్త మరణంతో తూప్రాన్ పట్టణ ప్రజల్లు శోక సంద్రంలో మునిగిపోయారు. తూప్రాన్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తూప్రాన్ మున్సిపల్ 6వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్త కు స్వయాన తండ్రి కావడంతో రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులు అర్పించి వారి కుటుంభానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేతి అంజయ్య గుప్త కు గురువారం తెల్లవారు జామున 3:30 గంటలకు గుండె నొప్పి రావడంతో హుటాహుటిన తూప్రాన్ లోని గీతా నర్సింగ్ హోమ్ కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 4:30 గంటల ప్రాంతంలో మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వెంటనే స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్యులు మరణించినట్లు దృవీకరించడంతో ఇంటికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కాగా స్వర్గీయ నేతి అంజయ్య గుప్త గత 69 ఏళ్ల క్రితం నుంచి కిరాణా దుకాణం ద్వార హాల్ సేల్ వ్యాపారం నిర్వహించిన మొదటి వ్యక్తి కావడం విశేషం కాగా అప్పటి నుండి తూప్రాన్ పరిసర ప్రాంతాలలో ఉన్న దాదాపు 60 గ్రామాల ప్రజలు వ్యాపారులు నేతి అంజయ్య గుప్త కు చెందిన ఎన్ ఎన్ టి కిరాణా షాపు కు వచ్చి కిరాణా సామాను తీసుకెళ్ళేవారు. ఇప్పుడు కొకొల్లలుగా హాల్ సేల్ షాప్ లు వెలిశాయి. తూప్రాన్ నుండి సినిమాలు చూడాలంటే సుదూర ప్రాంతమైన హైద్రాబాద్ కు వెళ్ళేవారు. ప్రేక్షకుల కోరిక మేరకు 40 ఏళ్ళక్రితం తూప్రాన్ లో శ్రీ వేంకటేశ్వర ధియేటర్ ను కొంత మంది భాగస్వాములతో కలిసి శ్రీ వేంకటేశ్వర టాకీస్ ను నెలకొల్పారు. కొత్త సినిమాలు సైతం తూప్రాన్ లో విడుదల చేయించారు. వ్యాపారం తోపాటు ఆధ్యాత్మికంగా జీవితాన్ని పరిపక్వత పొంది భగవత్ గీత లోని 18 అధ్యాయలనై అవలీలగా అపోసన పట్టి అనర్గళంగా భగవత్ గీత శ్లోకాలు పఠిస్తూ స్వాధ్యాయం చింతనలో మునిగితేలారు. ముఖ్యంగా తాడ్వాయి లోని శభరిమాత జీవించి ఉన్నప్పుడు ప్రధాన శిష్యులలో ఒకడైన నేతి అంజయ్య గుప్త నేటికీ శబరి మాత పీఠం ట్రస్ట్ లో కోశాధికారిగా కొనసాగుతున్నారు. నేతి అంజయ్య గుప్త మృతికి పలువురు వ్యాపార, వర్తక, వాణిజ్య, సంఘాల నాయకులు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్