ఇసుక దందాను ఆపకపోతే ఉద్యమిస్తాం
న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్
చర్ల, నవంబర్ 13 వై 7 న్యూస్
ప్రజల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చర్ల మండలం సి కత్తిగూడెం పంచాయతీ రోడ్లమీద ఇసుక మాఫియా వాహనాలు శివతాండవం చేస్తూ ప్రజా వాహనాలకు అంతరాయం కలిగిస్తుందని తక్షణమే ఇసుక దందాను ఆ వాహనాలను నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.పొద్దున సాయంత్రం బస్సులలో ప్రయాణిస్తున్న ప్రజలు పనులకు వెళ్లిన ప్రజలు డ్యూటీలోకి వెళ్లిన ఉద్యోగస్తులు తొందరగా ఇంటికి చేరుకోవాలని వెళ్తున్న వాహనాలకు అంతరాయం కలిగించే విధంగా గంటల తరబడి ప్రజావాహనాలు ఆగిపోయి ఇసుక వాహనాలు క్యూ కట్టి స్తంభించిపోతున్నాయని దీనితో ప్రభుత్వ బస్సులు మరియు ఇతర వాహనాలకు అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. సాయంత్రం కాగానే ఇసుక దందా నడుస్తుందని ప్రజల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న అధికారులు పోలీసులు కూడా ఈ ఇసుక దంధానీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఇది ప్రజలకు ఇంకాస్త ఇబ్బందిగా ఉందని తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని ఇసుక దందాను అరికట్టాలని రోడ్లమీద పర్మిషన్లు లేకుండా నడుస్తున్న వాహనాలను సీజ్ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా హెచ్చరిస్తున్నాం అని అన్నారు . ఈ ఇసుక నిజంగా ప్రజల కోసమే అయితే పట్టపగలు తొలకుండా రాత్రిపూట ఎందుకు తరలిస్తున్నారని, చర్ల మండల ప్రజలకు ఈ అధికారులు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతమైన చర్లలో పెట్టుబడిదారులు ఇసుక దందాను ఆసరాగా చేసుకుని ప్రజల్ని ఇక్కడ ఉన్న ఆదివాసీ చట్టాలని మోసం చేస్తున్నారని ఇసుక టెండర్లు ఇక్కడ చట్ట ప్రకారం ఎస్టీ వారికే ఇవ్వాలని వారు అన్నారు. బుధవారం సాయంత్రం ఇసుక లారీలు అడ్డంగా క్యూ కట్టడంతో అనేకమంది ఉద్యోగస్తులు ప్రజలు కార్మికులు కర్షకులు చాలా ఇబ్బందులకు గురయ్యారని ప్రజల అసహనానికి అధికారులు పోలీసులు గురికాకూడదని హితవుపలికారు.









