నిషేధిత మత్తు పదార్థాలతో కల్తీ కల్లు తయారీ
ఇష్టారాజ్యంగా కల్లు అమ్మకాలు
మూడు గ్లాసులు ఆరు సీసాలుగా వ్యాపారం
ప్రాణాలు పోతున్న పట్టించుకోరా?
ఎక్సైజ్ శాఖ మీ జాడ ఎక్కడ ?
రెంజల్, నవంబర్ 13 వై 7 న్యూస్ తెలుగు
ఉమ్మడి నిజామాబాద్
జిల్లాలోని గ్రామాలలో
అసలైన కళ్ళు గీత కార్మికుల నుంచి వారి లైసెన్సులను పొంది కొంతమంది కల్లు ముస్తేదారులు కల్లు డిపోలు ఏర్పాటు చేసుకొని అర్ధరాత్రి వరకు కృత్తిమ కల్తీ కల్లు తయారుచేసి చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేస్తారు. పూర్తిగా నిషేధిత మత్తు పదార్థంతో తయారుచేసిన ఈ కల్లుకు ఎంతోమంది బానిసలై అనారోగ్యం బారిన పడి ఆస్పత్రి పాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కల్లు ముస్తేదారులకు డబ్బులే మఖ్యం, ప్రజల ఆరోగ్యాలు ఏమైతే ఏమైంది తమకు దండిగా సొమ్ము వస్తుంది అనుకుంటూ, కల్లులో ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలను కలిపి కృత్తిమ కల్లు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది ఇలా ఉండగా రెంజల్ మండల కేంద్రంలో కల్లు డిపోలో తయారైన కల్లు సీసాలో బల్లి పడి ఉండగా దానిని కల్లు దుకాణమునకు సరఫరా చేశారు. బుధవారం సాయంత్రం బల్లి పడ్డ కల్లు ను తాగి ఓ వ్యక్తి అస్వస్థకు గురయ్యాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు అస్వస్థకు గురైన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇదండీ కల్లు ముస్తదారుల తీరు. ఎందుకంటే వీరికి ఎక్సైజ్ శాఖ అధికారులు అండదండలు ఉండడంతో ఇష్ట రాజ్యాంగం కల్తీకల్లు అమ్మకాలు కొనసాగుతున్నాయి. కోటగిరి, రుద్రూర్, జాన్కంపేట్, నిజం సాగర్, నసుల్లాబాద్, బాన్సువాడ, పోతంగల్, మద్నూర్, పిట్లం, బిచ్కుంద, ఎల్లారెడ్డి, గాంధారి, రెంజల్, ఎడపల్లి, నవీపేట్, నందిపేట్, నిజామాబాద్, కామారెడ్డి పట్టణాల్లో కృత్తిమ కల్లు జోరుగా సాగుతుంది. ప్రతినెల ఎక్సైజ్ శాఖకు ముడుపులు అందించి దర్జాగా కల్తీ కల్లు అమ్మకాలు సాగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే బుధవారం రెంజల్ మండల కేంద్రంలో కల్లు సీసాలో బల్లి పడ పడ్డ సంఘటన వెలుగులోకి వచ్చినది.
.